ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారు. (Modi resigns as PM) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమె ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని మోదీని కోరారు. జూన్ 8న శనివారం మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన నేతగా మోదీ నిలువనున్నారు. ఢిల్లీ ఫీఠాన్ని డిసైడ్ చేయనున్న కింగ్ మేకర్లు, మ్యాజిక్ ఫిగర్‌కు 31 సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీ, కీలకంగా మారిన చంద్రబాబు,నితీశ్ కుమార్ మద్దతు
నేడు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ చివరి సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై మంత్రులతో ఆయన చర్చించారు. అనంతరం 17వ లోక్‌సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
Here's News
प्रधानमंत्री @narendramodi ने राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मु से मुलाकात की। प्रधानमंत्री ने अपना और केन्द्रीय मंत्रिपरिषद का त्यागपत्र सौंपा। राष्ट्रपति ने त्यागपत्र स्वीकार करते हुए प्रधानमंत्री तथा उनके सहयोगियों से नई सरकार के गठन तक अपने पद पर बने रहने का… pic.twitter.com/n9yri078uH
— President of India (@rashtrapatibhvn) June 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)