Lok Sabha Election Results 2024: 2 coalition-era veterans emerge kingmakers as BJP falls short of majority

సార్వత్రిక సమరం ముగిసిన నేపథ్యంలొ అధికార బీజేపీ పార్టీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో మిత్రపక్షాల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఢిల్లీలో బుధవారం ఎన్డీయే పక్షాలు భేటీ కానున్నాయి. బీజేపీ సొంతంగా మ్యాజిక్ పిగర్ అయిన 272 సీట్లు సాధించలేకపోవడంతో మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టీడీపీకి 16, జేడీ యూకు 12 సీట్లు రావడంతో సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీయూ చీఫ్ నితీశ్ కీలకం కానున్నారు.ఢిల్లీ పీఠంపై ఎవరూ కూర్చోవాలనేది వారే నిర్ణయించనున్నారు.

తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రజలు స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి ఇవ్వలేదు. ఇండియా కూటమి 233 సీట్లలో గెలుపొందగా.. ఎన్డీయే కూటమి 293 సీట్లు సాధించింది. అయితే సొంతంగా 241 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కమలం పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కు 31 స్థానాల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఎన్డీయే కూటమికి మిత్రపక్షాల మద్దతు అనివార్యంగా మారింది. అదే సమయంలో 233 స్థానాల్లో గెలుపొందిన ఇండియా కూటమికి 39 స్థానాలు కావాల్సి ఉండటంతో ఆసక్తికరంగా మారింది.  543 ఎంపీ సీట్లలో 240 మాత్రమే గెలుచుకున్న బీజేపీ, 99 సీట్లతో పుంజుకున్న కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

అయితే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ 16 స్ధానాల్లో విజయం ఎగురవేసింది. ఆ పార్టీ మిత్రపక్షం జనసేన రెండు చోట్ల గెలుపొందింది. మరోవైపు బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని జేడీయూ 12 స్థానాల్లో గెలుపొందింది. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత ఈ రెండే పెద్ద పార్టీలు కావడం గమనార్హం. బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కకపోవడంతో నితీశ్‌ కుమార్‌, చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది.  బెంగాల్ కోటలో పాగా వేయలేకపోయిన బీజేపీ, అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న మమతా బెనర్టీ, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్

ఈ నేపథ్యంలో తమ వ్యూహం ఏమిటనేది ముందే చెప్పేస్తే మోదీ జాగ్రత్త పడతారని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం ఆకస్తికరంగా మారింది. ఈనెల 8న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి తాను హాజరవుతానని బాబుకు మోదీ చెప్పారు.