Mamatha benarji

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందున నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండు చేశారు. అయోధ్యలో ఓటమే ఇందుకు రుజువని వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోదీకి మెజార్టీ సీట్లు దక్కనందుకు సంతోషపడుతున్నా. ఆయన విశ్వసనీయత కోల్పోయారు. 400కుపైగా సీట్లు సాధిస్తామంటూ ఆయన చెప్పిన మాట నిజం కానందున వెంటనే పదవికి రాజీనామా చేయాలి. మోదీ, అమిత్‌ షాలు ఎంతో సొమ్ము వెచ్చించినా ఇండియా కూటమి గెలిచింది’’ అని వ్యాఖ్యానించారు.  బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసిన యూపీ ఓటర్లు, పనిచేయని మోదీ బుల్డోజర్ మంత్రం, ఉత్తర ప్రదేశ్‌లో పార్టీల వారీగా గెలిచిన సీట్లు వివరాలు ఇవిగో..

భారతదేశంలోని ప్రజలు, ముఖ్యంగా బెంగాల్‌లోని ప్రజలు బిజెపి వెన్నెముకను విరిచారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను 29 స్థానాల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. బీజేపీ 12 స్థానాలు, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి. టిఎంసి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అవతరించింది.కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 18 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) 22 స్థానాల్లో, INC 2 స్థానాల్లో విజయం సాధించగలిగింది.