SC on Dy CMs in States: రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, రాజ్యాంగ వ్యతిరేకం కాదని విలువలకు లోబడే జరుగుతుందని స్పష్టం చేసిన ధర్మాసనం
డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని కోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నేడు ఈ తీర్పును ఇచ్చింది.
రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రుల(Deputy Chief Ministers) నియామకంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని కోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నేడు ఈ తీర్పును ఇచ్చింది. రాజ్యాంగ విలువ ప్రకారం డిప్యూటీ సీఎంల నియామకం జరుగుతుందని ధర్మాసనం తెలిపింది. ముఖ్యమంత్రి పరిధిలో ఉండే మంత్రిమండలిలో డిప్యూటీ సీఎంలు భాగమని కోర్టు పేర్కొన్నది.
డిప్యూటీ సీఎంల నియామకాన్ని తప్పుపడుతూ దాఖలైన పిల్‌ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. డిప్యూటీ పోస్టుల గురించి రాజ్యాంగంలో ఎక్కడా లేదని పిటీషనర్లు వాదించారు. అయితే డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదు అని సుప్రీంకోర్టు తెలిపింది.ఇప్పటికి పలు రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్న విషయం తెలిసిందే.
Here's ANI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)