Tamizhagam Row: ట్రెండింగ్‌లో గెట్‌అవుట్‌రవి హ్యాష్‌ట్యాగ్‌, తమిళనాడు గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం పెట్టిన సీఎం స్టాలిన్, భగ్గుమన్న బీజేపీ, అన్నాడీఎంకే

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి వ్యతిరేకంగా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ‘గెట్‌అవుట్‌రవి’ (Get out Ravi) అనే హ్యాష్‌ట్యాగ్‌తో గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో పోస్టులు వెళ్లువెత్తుతున్నాయి.

Get out Ravi Poster (Photo-ANI)

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి వ్యతిరేకంగా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ‘గెట్‌అవుట్‌రవి’ (Get out Ravi) అనే హ్యాష్‌ట్యాగ్‌తో గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో పోస్టులు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. చెన్నైలో ట్విట్టర్‌ నంబర్‌ 1 ట్రెండింగ్‌ గెట్‌అవుట్‌రవి అనే పోస్టర్లు వెలిచాయి. పోస్టర్‌పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సహా డీఎంకే పార్టీ నేతల ఫోటోలతో (Get out Ravi' posters spotted) పోస్టర్లు ఉన్నాయి. గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన వారికి డీఎంకే నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

Here's ANI Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now