Yashwant Sinha Hyd Visit: హైదరాబాదుకు చేరుకున్న యశ్వంత్ సిన్హా, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. సిన్హాకు కేసీఆర్, తెలంగాణ కేబినెట్ మంత్రులు ఘన స్వాగతం పలికారు.

Yashwant Sinha Visit Hyd (Photo-TRSOffice)

దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. సిన్హాకు కేసీఆర్, తెలంగాణ కేబినెట్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో వీరందరూ భారీ ర్యాలీగా ఎయిర్ పోర్టు నుంచి నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కు వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్, సిన్హా ప్రసంగించనున్నారు. జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలం నెలకొంది.

Yashwant Sinha Visit Hyd (Photo-TRSOffice)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)