UP Elections 2022: యూపీలో బీజేపీకి మళ్లీ షాక్, పార్టీని వీడిన మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ, సమాజ్‌వాదీలోకి ఆహ్వానిస్తున్నానంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్
తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి గుడ్‌బై చెప్పి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సైనీని సమాజ్‌వాదీలోకి ఆహ్వానిస్తున్నానంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మళ్లీ షాక్ తగిలింది. తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి గుడ్‌బై చెప్పి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సైనీని సమాజ్‌వాదీలోకి ఆహ్వానిస్తున్నానంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితమే మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి టాటా చెప్పి సమాజ్‌వాదీలో చేరారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కమలం పార్టీని వదిలి ఇతర పార్టీలకు వలస వెళ్తున్నారు. ఇక యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌కు ఓబీసీ నేత దారా సింగ్ చౌహాన్ బుధవారం రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా అంకితభావంతో పని చేశానని, అయితే దళితులు, ఓబీసీలు, నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం నుంచి న్యాయం జరగలేదని చౌహాన్ అన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)