Kejriwal Gujarat Visit: వైరల్ వీడియో, ప్రజలను కలవడానికి సెక్యూరిటీ కావాలా, మీ సెక్యూరిటీ వద్దు మీరే తీసుకోండి, అహమ్మదాబాద్ పోలీసులపై మండిపడిన అరవింద్ కేజ్రీవాల్

ప్రజలను కలవడానికి కూడా ప్రోటోకాల్ కావాలా అని అడిగారు. సెక్యూరిటీ పేరుతో ఆపడం సరికాదన్నారు. మీ సెక్యూరిటీ వద్దు అని.. కావాలంటే మీరే తీసుకోవాలని కోరారు. మీరు తనను అరెస్ట్ చేయలేరని కేజ్రీవాల్ అన్నారు.అయితే ఆ టైంలో కాసేపు పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.

Aravind Kejriwal (Photo-Video Grab)

గుజరాత్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో తన పర్యటనతో జోరు పెంచుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఆటోవాలా తన ఆటోలో వస్తావా అని అడగగా.. ఓ యస్ అనేశారు.ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ ఇంటికి వెళుతుండగా పోలీసులు భద్రతా కారణాలు చెప్పి ఆపి వేశారు. ఆ క్రమంలో పోలీసులతో వాగ్వివాదం జరిగింది.

ప్రజలను కలవడానికి కూడా ప్రోటోకాల్ కావాలా అని అడిగారు. సెక్యూరిటీ పేరుతో ఆపడం సరికాదన్నారు. మీ సెక్యూరిటీ వద్దు అని.. కావాలంటే మీరే తీసుకోవాలని కోరారు. మీరు తనను అరెస్ట్ చేయలేరని కేజ్రీవాల్ అన్నారు.అయితే ఆ టైంలో కాసేపు పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. చివరకు.. ఓ కానిస్టేబుల్‌ ఆ ఆటో డ్రైవర్‌ పక్కన కూర్చోగా, రెండు పోలీసు వాహనాలు ఆ ఆటోను విక్రమ్‌ ఇల్లు ఉన్న ఘాట్లోడియా వరకు అనుసరించాయి. ఇక.. ఇదంతా నాటకమని, కేజ్రీవాల్‌ గొప్ప నటుడని గుజరాత్‌ మంత్రి హర్ష సంఘ్వీ ఎద్దేవా చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement