GSB Seva Mandal: ముంబైలో ఖరీదైన వినాయకుడ్ని ప్రతిష్టించిన జీఎస్బీ సేవా మండల్.. 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో వినాయక విగ్రహం.. రూ.360 కోట్లతో గణేశ్ మండపానికి బీమా (వీడియోతో)

దేశవ్యాప్తంగా గణేష్ సంబురాలు మిన్నంటుతున్నాయి. ముంబైలో జీఎస్బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన వినాయకుడి గురించి తెలిస్తే ఔరా అంటారు. ఈ వినాయక మండపానికి కళ్లు చెదిరే రీతిలో రూ.360 కోట్లతో బీమా చేయించారు.

Credits: X

Mumbai, Sep 19: దేశవ్యాప్తంగా గణేష్ సంబురాలు మిన్నంటుతున్నాయి. ముంబైలో (Mumbai) జీఎస్బీ సేవా మండల్ (GSB Seva Mandal) ఏర్పాటు చేసిన వినాయకుడి (Lord Ganesh) గురించి తెలిస్తే ఔరా అంటారు. ఈ వినాయక మండపానికి కళ్లు చెదిరే రీతిలో రూ.360 కోట్లతో బీమా చేయించారు. అందుకు కారణం ఉంది. ఇక్కడి గణేశుడి విగ్రహాన్ని 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో రూపొందించారు.  భద్రతాపరంగానూ ఈ మండపం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లేని విధంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. గతేడాది కూడా జీఎస్బీ సేవా మండల్ వినాయకుడికి రూ.316 కోట్లకు బీమా చేశారు. ఈ ఏడాది 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేశారు.

MLC Kavitha: అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నది.. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now