![](https://test1.latestly.com/uploads/images/2025/02/1-585979448.jpg?width=380&height=214)
Hyderabad, Feb 11: తెలంగాణలో (Telangana) కొత్త రేషన్‌కార్డుల (New Ration Cards) దరఖాస్తు ప్రక్రియపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది. ‘మీ సేవ’ అధికారులతో సోమవారం పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ ను అధికారులు పునరుద్ధరించారు. దీంతో మూడు రోజుల తర్జన భర్జనకు తెరపడినట్లయింది. అయితే, ఇప్పటికే ప్రజాపాలన, కులగణన, ప్రజావాణిలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని, వాటి పరిశీలన ఇప్పటికే మొదలైందని అధికారులు తెలిపారు.
మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల అఫ్లికేషన్లు.. సస్పెన్స్‌కు తెరదించిన అధికారులు#NewRationCards #TelanganaNews https://t.co/KWC2svWdsm
— Samayam Telugu (@SamayamTelugu) February 11, 2025
గందరగోళం ఇలా..
పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచే ‘మీ సేవ’ వెబ్ సైట్ లో రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, 8వ తేదీ ఉదయం వెబ్ సైట్ నుంచి ఆ ఆప్షన్ మాయమైంది. దీంతో దరఖాస్తు దారుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు సమావేశమైన పౌరసరఫరాల అధికారులు రేషన్ కార్డుల జారీపై మరింత లోతుగా చర్చించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం, క్యాబినెట్ నిర్ణయం కూడా ముందే జరగడంతో కార్డుల జారీకి సాంకేతికంగా ఎలాంటి సమస్య రాదన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించాలని మరోమారు ఆదేశించారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచి ‘మీ సేవ’ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.