Ayodhya Deepotsav World Record: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. 21 లక్షల దీప కాంతుల నడుమ మిరిమిట్లు గొలిపిన అయోధ్య నగరం.. ప్రపంచ రికార్డు (వీడియోలతో)

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దీపోత్సవం నిర్వహించారు.

Deepotsav (Credits: X)

Ayodhya, Nov 12: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya) నగరంలో అంగరంగ వైభవంగా దీపోత్సవం (Deepotsav) జరిగింది. దీపావళి (Diwali) పండుగ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దీపోత్సవం నిర్వహించారు. 21 లక్షల దీప కాంతుల నడుమ అయోధ్య నగరం మిరిమిట్లు గొలిపింది. ఇది ప్రపంచ రికార్డు. ఈ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హారతి కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరం దీపాల కాంతులతో మెరిసిపోయింది. లోపలివైపున దీప కాంతుల వెలుగులతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకున్నది. దీపోత్సవం సందర్భంగా రామ మందిరం లోపలి వైపు దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు.

Diwali 2023: దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేస్తున్నారా...అయితే ఈ తప్పులు చేస్తే మాత్రం దరిద్రులు అయిపోతారు..జాగ్రత్త..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)