Ganesh Chaturthi 2022: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్
వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)