Kisan Diwas 2021 Wishes: జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు, కిసాన్ దివస్ 2021 విషెస్, కోట్స్, వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం
రైతు లేనిదే మనిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు.
జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం. రైతు లేనిదే మనిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తింటున్నామంటే అది రైతు వల్లే. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జన్మదినమైన ఈ రోజు డిసెంబర్ 23న రైతు దినోత్సవం (Kisan Diwas 2021) జరుపుకుంటారు.
చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5 వ ప్రధాన మంత్రి. అన్నదాతల ప్రయోజనాల కోసం, వ్యవసాయం కోసం అతను అనేక ముఖ్యమైన పనులు చేసాడు. దేశంలోనే ప్రముఖ రైతు నాయకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. దేశ ప్రధానిగా ఉన్న చౌదరి చరణ్ సింగ్ రైతులు, వ్యవసాయ రంగ అభ్యున్నతిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది.
రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు. వ్యవసాయ రంగం, రైతుల ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషికి 2001లో భారత ప్రభుత్వం డిసెంబర్ 23ని రైతు దినోత్సవంగా (Farmer's Day 2021) జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున కిసాన్ దివస్‌గా జరుపుకుంటారు. రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.రైతులు ఆయన్ని భారతదేశపు రైతుల విజేతగా కీర్తించారు. జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే కోట్స్ మీ కోసం..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)