Bhadrachala Seetha Rama Swamy Kalyana Talambralu: రూ. 151 చెల్లిస్తే మీ ఇంటికే భద్రాచల సీతారాముల స్వామి కళ్యాణ తలంబ్రాలు, ఎలా బుక్ చేసుకోవాలంటే..

ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్‌ ఆర్టీసీ తెలిపింది.

TSRTC To Home Delivery Bhadrachala Seetha Rama Swamy Kalyana Talambralu For Cost 0f RS 151

భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు హోం డెలివరీ రూపంలో అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్‌ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు.  మగవాళ్లు చీరలు కట్టుకుని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు, కర్నూలు జిల్లాలో హోళీ పండగ రోజు జరిగే వింత ఆచారం గురించి ఎవరికైనా తెలుసా..

కాగా ఏప్రిల్‌ 17న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని సూచించారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)