DCGI: నాలుగేండ్ల లోపు పిల్లలకు ఎఫ్‌డీసీ మందులు వాడొద్దు: డీజీసీఐ
నాలుగేండ్ల లోపు పిల్లల్లో జలుబు నివారణ కోసం ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్‌డీసీ)తో తయారయ్యే మందుల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నిషేధించింది.
Newdelhi, Dec 22: నాలుగేండ్ల లోపు పిల్లల్లో జలుబు (Cold) నివారణ కోసం ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్‌డీసీ-FDC)తో తయారయ్యే మందుల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (డీసీజీఐ-DCGI) నిషేధించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం వినియోగదారులకు తెలిసేలా మందుల లేబుళ్లపై సమాచారాన్ని ముద్రించాలని ఔషధ కంపెనీలకు తెలిపింది. ఎఫ్‌డీసీ హేతుబద్ధ ఔషధమైనా చిన్న పిల్లల్లో దాని వినియోగం ఆమోదయోగ్యం కాదన్న నిపుణుల కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)