Pesticides Effects on Sperm Count: పురుగు మందుల ప్రభావంతో మగవారిలో తగ్గుతున్న వీర్య కణాలు.. సంతానోత్పత్తిపై ప్రభావం.. తాజా అధ్యయనం

పురుగు మందుల ప్రభావంతో మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నదని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌ స్పెక్టివ్స్‌ జర్నల్‌ లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.

Sperm cells (Credits: X)

Newdelhi, Nov 20: పురుగు మందుల (Pesticides) ప్రభావంతో మగవారిలో వీర్య కణాల సంఖ్య (Sperm Count) తగ్గిపోతున్నదని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌ స్పెక్టివ్స్‌ జర్నల్‌ లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. గత 50 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఒక మిల్లీలీటర్‌ వీర్యంలో (Sperm) ఉండే కణాల సంఖ్య 50% తగ్గిపోయిందని పరిశోధకులు మెలిస్సా పెర్రీ వెల్లడించారు. ఇండ్లు, ఉద్యానవనాలు, ఆహారం మీద చల్లే ఆర్గానో ఫాస్ఫేట్స్‌, ఎన్‌-మిథైల్‌ కార్బమేట్స్‌ వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె తెలిపారు. ఈ పురుగు మందులు సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్‌ అలెగ్జాండర్‌ పాస్టుస్‌ జాక్‌ తెలిపారు. వ్యవసాయ రంగంలో పనిచేసేవారు ఈ పురుగు మందుల ప్రభావానికి ఎక్కువగా గురవుతారని వెల్లడించారు.

Rohit Sharma on World Cup Final: మా ఓట‌మికి కార‌ణాలివే! వ‌ర‌ల్డ్ క‌ప్ లో ప‌రాజ‌యంపై రోహిత్ శర్మ కీల‌క కామెంట్స్, పిచ్ కూడా మ‌మ్మ‌ల్ని దెబ్బ‌తీసింది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now