Ahmadabad, NOV 19: చేయాల్సినంతా చేశామని అయితే ఈ రోజు ఫలితం అనుకూలంగా రాలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు (Rohit Sharma Comments). మరో 20 నుంచి 30 పరుగులు చేస్తే పలితం మరోలా ఉండేదన్నాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (India Defeat) చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన అనంతరం మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ సదరు వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతీది ప్రయత్నించాం. అయితే.. ఈ రోజు ఫలితం మనకు అనుకూలంగా లేదు. వాస్తవానికి ఇలా జరగకూడదు. మరో 20 నుంచి 30 పరుగులు చేస్తే బాగుండేది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఆ సమయంలో 270-280 పరుగులు చేస్తామని భావించాను. అయితే.. వరుసగా వికెట్లు కోల్పోవడంతో 240 పరుగులకే పరిమితం అయ్యాము.’ అని రోహిత్ (Rohit Sharma) చెప్పాడు.
Nothing is more painful than watching tears in 𝗥𝗼𝗵𝗶𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮's eyes again after 2️⃣0️⃣1️⃣9️⃣ CWC!💔😢#RohitSharma #CWC2023Final #ind pic.twitter.com/6UsAF80gkM
— Cricdiction (@cricdiction) November 19, 2023
‘తక్కువ స్కోరు ఉన్నప్పుడు గెలవాంటే వికెట్లు తీయాల్సిందే. ఆరంభంలో వికెట్లు పడగొట్టాము. ఓదశలో ఆస్ట్రేలియా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో వికెట్ తీసి వారిపై ఒత్తిడి పెంచితే బాగుండేది. అయితే.. ట్రావిస్ హెడ్, లబుషేన్‌లు మంచి భాగస్వామ్యం నెలకొల్పి మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. లక్ష్య ఛేదనలో పిచ్ బ్యాటింగ్ ఎక్కువగా సహకరించింది. అయితే.. దీన్ని సాకుగా చెప్పడం ఇష్టం లేదు. వాస్తవం ఏమిటంటే మేము ఎక్కువ పరుగులు చేయలేదు.’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ (India).. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54), కెప్టెన్ రోహిత్ శర్మ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో రెండు, మాక్స్‌వెల్, జంపాలు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
ట్రావిస్ హెడ్ (137) సెంచరీతో చెలరేగడంతో లక్ష్యాన్ని ఆసీస్ 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4)లు విఫలమైన లబుషేన్ (58 నాటౌట్) హాప్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా రెండు, మహ్మద్ షమీ, సిరాజ్ లు చెరో వికెట్ పడగొట్టారు. ఈమ్యాచ్‌లో భారత బౌలర్లు 18 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం గమనార్హం.