Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్.. రెండు రోజులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు.. ఎందుకంటే??
డిసెంబర్ 31, జనవరి 1న శ్రీశైలం మల్లన్నకు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
Srisailam, Dec 30: శ్రీశైలం (Srisailam) భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి వెళ్లాలనుకున్నా భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ 31, జనవరి 1న శ్రీశైలం మల్లన్నకు (Srisailam Mallanna) ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి త్వరితగతిన దర్శనాలు కల్పించడంలో భాగంగా స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలు కూడా నిలిపివేస్తున్నట్టు చెప్పారు. సామూహిక అభిషేకాలు, బ్రేక్ టికెట్ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారని, భక్తులు గమనించాల్సిందిగా కోరారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)