Jagannath Puri Rath Yatra 2021: ఘనంగా పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర, కరోనా కారణంగా భక్తులకు అనుమతి నిరాకరణ, పూరీ రాజు, వేది పండితులు, ఆల‌య అర్చ‌కులు, సిబ్బందితో రథయాత్ర

Jagannath-Rath-Yatra (photo-ANI)

ఒడిశాలో ప్రఖ్యాత ఆలయం పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర ఘ‌నంగా కొన‌సాగుతున్న‌ది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కార‌ణంగా గ‌త ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్ర‌భుత్వం భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోయినా.. పూరీ రాజు, వేది పండితులు, ఆల‌య అర్చ‌కులు, సిబ్బంది క‌లిసి రథయాత్రను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆషాఢ శుక్ల విదియ నాడు అంటే ఇవాళ.. వేద‌ పండితులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి ‘మనిమా’ (జగన్నాథా) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఉత్స‌వ‌మూర్తుల‌ను క‌దిలించ‌డం ద్వారా ర‌థ‌యాత్రా ప‌ర్వం మొద‌లైంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)