Ayodhya Ram Temple Consecration: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ రేపే.. ఇప్పటివరకూ ఏయే రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయంటే??
22న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒంటిపూట సెలవును ప్రకటించారు.
Ayodhya, Jan 21: 22న అయోధ్య (Ayodhya) రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒంటిపూట సెలవును (Holiday) ప్రకటించారు. కొన్ని రాష్ర్టాలు పూర్తిగా, మరికొన్ని మధ్యాహ్నం 2.30 వరకు సెలవిచ్చాయి. యూపీ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి పూర్తి సెలవు ప్రకటించగా, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్ గఢ్, అస్సాం, ఒడిశా సగం రోజు సెలవు ఇచ్చాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ పాఠశాలలకు సెలవు ఇచ్చాయి. తమ సంస్థల ఉద్యోగులకు రిలయన్స్ సోమవారం సెలవు ప్రకటించింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని సోమవారం స్టాక్ మార్కెట్లు తెరుచుకోవు. దానికి బదులుగా సెలవుదినమైన శనివారం స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఎయిమ్స్ లో కూడా హాఫ్ డే సెలవు ప్రకటించారు.
Ram Lalla Leaked Pics: అయోధ్య బాలరాముడి ఫోటోలు నిజమైనవి కావా? ఇంతకీ శిల్పి ఏం చెప్పారంటే?
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)