Yadadri Name Change: యదాద్రి ఇకపై మళ్లీ యాదగిరిగుట్ట.. పేరు మారుస్తామన్న తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి మళ్లీ పేరు మార్చుకోనున్నదా? క్షేత్రం మునుపటి పేరు యాదగిరి గుట్టగానే స్థిరపడనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
Yadagirigutta, Mar 2: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి (Yadadri) మళ్లీ పేరు మార్చుకోనున్నదా? క్షేత్రం మునుపటి పేరు యాదగిరిగుట్టగానే (Yadagirigutta) స్థిరపడనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. ఆలయంలోని కొబ్బరి కాయ కొట్టే స్థలాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)