
Hyderabad, FEB 21: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట పునర్నిర్మాణ కర్త, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. మార్చి 1 నుంచి 11 వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్‌ను ఆలయ పూజారులు కోరారు.
Yadagirigutta Priests Meet BRS Chief KCR
యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి కేసీఆర్ గారికి ఆహ్వానం
అనంతరం జరిగే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా పూజారుల ఆహ్వానం.
• నాటి కేసీఆర్ ప్రభుత్వ పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం… pic.twitter.com/GfkBk6Y4WT
— BRS Party (@BRSparty) February 21, 2025
ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారులతో కూడిన బృందం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రాలతో కేసీఆర్‌కు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈఓ భాస్కర్, ముఖ్య అర్చకులు నరసింహమూర్తి, కిరణ్ కుమారాచార్యులు, పీఆర్ఓ రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.