Mumbai Car Accident: ముంబైలోని బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి.. ఆరుగురికి తీవ్రంగా గాయాలు

గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి టోల్‌ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది.

Mumbai Car Accident (Credits: X)

Mumbai, Nov 10: ముంబైలోని (Mumbai) బాంద్రాలో (Bandra) ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు (Speeding car) అదుపుతప్పి టోల్‌ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. సీ లింక్‌ లో టోల్ ప్లాజాకు 100 మీటర్ల సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు తొలుత మెర్సిడెస్‌ బెంజ్‌ కారును ఢీకొట్టింది. అప్పటికీ ఆగకుండా మరో నాలుగు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ్‌ (DCP Krishnakant Upadhyay) తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

Rain Alert to Telangana: తెలంగాణలోని 15 జిల్లాలకు వర్ష సూచన.. రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని యెల్లో అలర్ట్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)