Children Drown In Lake: ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో నీటమునిగి ఐదుగురు టీనేజర్ల దుర్మరణం.. గుజరాత్‌లోని బోతాద్ జిల్లాలో ఘటన

గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో పడి ఐదుగురు టీనేజర్లు శనివారం మృతి చెందారు. తొలుత నీళ్లల్లో దిగిన వారిని కాపాడేందుకు ప్రయత్నించిన బాలురు నీట మునిగిపోయారు.

Representtaional Image (Photo Credits: Pixabay)

Gandhinagar, May 14: గుజరాత్‌లో (Gujarat) దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో (Krishnasagar Lake) పడి ఐదుగురు టీనేజర్లు (Teenagers) శనివారం మృతి చెందారు. తొలుత నీళ్లల్లో దిగిన వారిని కాపాడేందుకు ప్రయత్నించిన బాలురు నీట మునిగిపోయారు. మృతులు అందరూ 16-17 ఏళ్ల వారేనని స్థానిక పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం తొలుత ఇద్దరు బాలురు లేక్ లోకి దిగి మునిగిపోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మరో ముగ్గురు తమ స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించారు. దురదృష్ణవశాత్తూ వారు కూడా మరణించారని బోతాద్ ఎస్పీ కిషోర్ బలోలియా పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement