Arshia Goswami: 8 ఏళ్ల బాలిక.. 62 కిలోలు ఎత్తి గిన్నిస్ రికార్డ్.. హర్యానాకు చెందిన అర్షియా గోస్వామి విశేషం..
హర్యానాకు చెందిన 8 ఏళ్ల బాలిక ఏకంగా 62 కిలోల బరువు ఎత్తి గిన్నిస్ రికార్డు సాధించింది. పంచ్ కుల జిల్లాకు చెందిన అర్షియా గోస్వామి 30 సెకన్లలో 17సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్‌లిఫ్టింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Newdelhi, Aug 12: హర్యానాకు (Haryana) చెందిన 8 ఏళ్ల బాలిక ఏకంగా 62 కిలోల బరువు ఎత్తి గిన్నిస్ రికార్డు (Gunnies World Record) సాధించింది. పంచ్ కుల జిల్లాకు చెందిన అర్షియా గోస్వామి (Arshia Goswami) 30 సెకన్లలో 17సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్‌లిఫ్టింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అర్షియా ప్రస్తుతం అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ గుర్మెల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఓ టీవీ చానల్ నిర్వహించే ‘ఇండియాస్ గాట్ టాలెంట్’లో జులైలో అర్షియా 62 కేజీల బరువు ఎత్తి గిన్నిస్ రికార్డులకెక్కింది. ఆమె ప్రతిభకు ముగ్గుడైన హర్యానా అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్‌చంద్ గుప్తా ఘనంగా సన్మానించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)