Kolkata, April 04: బెంగాల్ లోని జాదవ్ పూర్ లోక్ సభ స్ధానంలో పోటీ చేస్తున్న డాక్టర్ చంద్రచూర్ గో స్వామి (Chandrachur Goswami) అభ్యర్ధిత్వంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల భారత హిందూ మహాసభ (Akhil Bharat Hindu Mahasabha) తరుపున పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. ముఖ్యంగా అఖిల భారత హిందూ మహా సభ బెంగాల్ అధ్యక్షుడు స్వామి సుందర్ గిరి మహరాజ్ (Swami Sundar Giri Maharaj) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రచూర్ గోస్వామి ఓ క్రిమినల్ అంటూ ఆయన సంబోంధించారు. అంతేకాదు తమ సంస్థతో చంద్రచూర్ కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.
Chandrachur Goswami Is a 'Thug', Not Associated With 'Real' Akhil Bharat Hindu Mahasabha: Swami Sundar Giri Maharaj #ChandrachurGoswami #AkhilBharatHinduMahasabha #HinduMahasabha #SwamiSundarGiriMaharaj #Jadavpur https://t.co/TcZAid7ZWz
— LatestLY (@latestly) April 3, 2024
కొద్ది రోజుల క్రితమే తమ సంస్థతో గోస్వామికి సంబంధాలు తెగిపోయాయని చెప్పారు. అంతేకాదు హిందూమహాసభ తరుపున తాము ఎలాంటి అభ్యర్ధులను నిలపడం లేదని స్పష్టం చేశారు. 2022 వరకు అఖిల భారత హిందూ మహాసభలో గోస్వామి పనిచేశారు కానీ, ఆ తర్వాత సొంత ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కడంతో ఆయన్ను తొలగించినట్లు చెప్పారు. అయితే బెంగాల్ లో హిందూ మహాసభ ఈ ఎన్నికల్లో బీజేపీకి కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపిచండం లేదు.