Smartphone Addiction: స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ డౌన్ అయిపోతుంటే.. ఇండియన్స్ గుండెల్లో దడదడ.. అసలేంటీ విషయం??
ఫోన్ లో బ్యాటరీ పూర్తిగా డౌన్ అయితే 65 శాతం మంది భావోద్వేకానికి గురవుతున్నట్టు వెల్లడైంది.
Newdelhi, May 6: నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేని వ్యక్తి లేడు. చేతిలో ఒక్క క్షణం ఫోన్ లేకపోయినా పొద్దుపోని పరిస్థితి. ఇప్పుడు అదే జాడ్యం ఇబ్బందులకు దారితీస్తున్నది. తమ ఫోన్ లో బ్యాటరీ (Phone Battery) 20 శాతం కంటే తక్కువకు చేరితే, దేశంలో 72 శాతం కంటే ఎక్కువమంది ఆందోళనకు గురవుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఫోన్ లో బ్యాటరీ పూర్తిగా డౌన్ అయితే 65 శాతం మంది భావోద్వేకానికి గురవుతున్నట్టు వెల్లడైంది.