Hyderabad, May 6: ఇన్ స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) సరదా ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. రైల్వే ట్రాక్ పై (Railway Track) రీల్స్ (Reels) చేస్తుండగా విద్యార్థి (Student) మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని (Hyderabad) సనత్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. శుక్రవారం మధ్యాహ్నం రైల్వే లైన్ సమీపంలో ముగ్గురు యువకులు ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన రైలు సర్ఫరాజ్ (16) అనే విద్యార్థిని ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు రైలు రాకను గమనించి పక్కకు తప్పుకున్నారు. సమాచారం రాగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A 16 year old boy named #Sarfaraz died on the spot after being hit by a train while recording an Instagram reel video at railway track Sanatnagar station. #Hyderabad pic.twitter.com/N9axC5psk5
— Iqbal Hussain⭐ اقبال حسین (@iqbalbroadcast) May 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)