Woman Falls Off Bus: వీడియో ఇదిగో, స్పీడ్‌గా వెళ్తున్న బస్సు నుంచి కిందపడిన మహిళ, దాదాపు 20 అడుగుల దూరం ఎగిరి పడటంతో తీవ్ర గాయాలు

తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్‌లో ( Namakkal ) షాకింగ్ సంఘటన చోటు చేసింది. ఒక బస్సు షార్ప్ టర్న్ తీసుకోవడం వల్ల ఒక మహిళ బస్సు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ పుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది.

Woman Falls Off From Moving Bus

Woman Falls Off From Moving Bus: తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్‌లో ( Namakkal ) షాకింగ్ సంఘటన చోటు చేసింది. ఒక బస్సు షార్ప్ టర్న్ తీసుకోవడం వల్ల ఒక మహిళ బస్సు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ పుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. బస్సులో శారద ( Sarada )అనే ఒక మహిళ ఎక్కింది.  శభాష్ కండక్టర్, బస్సులో నుంచి కిందపడబోయిన ప్రయాణికుడిని కాపాడిన కండక్టర్, సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

ఆమె బస్సు డోర్ దగ్గర నిలబడి ఉంది.బస్సు ఒక టర్నింగ్ తీసుకున్నప్పుడు, ఆమె బ్యాలెన్స్ కోల్పోయి బస్సు నుంచి బయటకు ఎగురుతూ దాదాపు 20 అడుగుల దూరంలో రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనను చూసిన ఇతర ప్రయాణికులు హడవిడిగా బస్సు కండక్టర్‌కు తెలియజేశారు.దీంతో బస్సు డ్రైవర్ బస్సును ఆపివేశాడు.గాయపడిన శారదను వెంటనే సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె సేలంకు వెళ్లి బట్టలు కొని బస్సులో తిరిగి ఇంటికి వస్తున్నట్లు తెలుస్తోంది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now