Maadhavi Latha Crying Video: మగాడిలా పోరాడుతూనే ఉన్నానంటూ భోరున ఏడ్చేసిన మాధవీలత, తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ ప్రశ్న

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ మధ్య జరిగిన వివాదాలపై ఏడుస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. " చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది.

Maadhavi Latha Gets Emotional on Recent Controversy (photo-FB)

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ మధ్య జరిగిన వివాదాలపై ఏడుస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. " చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం ..అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పడే ఇవే మాటలన్నారు. నా పార్టీ ( ప్రజల) కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకున్నది లేదు ..ఎవరికి ద్రోహం చేసింది లేదు , మోసం చేసింది లేదు , కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు.

సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆవేశంతోనే మాధవిలతపై ఆ పదం వాడానని వెల్లడి... వీడియో

ఆడపిల్లగా ఎపుడు నేను సింపతీ గేమ్ ఆడలేదు. మహిళల చట్టాలను అనుకూలంగా ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను .. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం , స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు , సోషల్ మీడియా లో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు ..నా బాధని మీతో పంచుకున్నందుకు…. క్షమించండి … మీ ప్రేమ అభిమానం , ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి " అంటూ మాధవీలత తన పోస్టులో వెల్లడించారు.ఈ మధ్య తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పడంపై కూడా ఆమె స్పందించారు. తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ మాధవీలత ప్రశ్నించారు.

Maadhavi Latha Gets Emotional on Recent Controversy

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement