Agniveer Dies by Suicide: యూపీలో అగ్నివీర్ ఆత్మహత్య, సెలవులు లేకపోవడంతో ఒత్తిడికిలోనై సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు

మంగళవారం రాత్రి సెంట్రీ విధులు నిర్వహిస్తున్న సమయంలో శ్రీకాంత్ కుమార్ చౌదరి అనే అగ్నివీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.2022లో అతడు అగ్నివీరుడిగా భారత ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. శ్రీకాంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు

Agniveer Dies by Suicide in UP

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి సెంట్రీ విధులు నిర్వహిస్తున్న సమయంలో శ్రీకాంత్ కుమార్ చౌదరి అనే అగ్నివీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.2022లో అతడు అగ్నివీరుడిగా భారత ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. శ్రీకాంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. బీహార్ యూనిట్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

శ్రీకాంత్ స్వస్థలమైన నారాయణపూర్ గ్రామంలో అంత్యక్రియలు జరిగినట్టు పేర్కొన్నారు. అయితే, ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సిబ్బంది కొరత కారణంగా సెలవులు లభించక ఒత్తిడికిలోనై శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. శ్రీకాంత్ వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ తెలిపారు. అతడి కుటుంబసభ్యులు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్మీకి వ్య‌తిరేకంగా అగ్నివీర్ స్కీమ్,లోక్‌సభలో ఎన్డీఏపై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ, కౌంటర్ విసిరిన రాజనాథ్ సింగ్

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)