Supreme to Centre: ప్రపంచ కప్ ను దాటి పోనివ్వొద్దు.. భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం అంశంలో.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
New Delhi, August 18: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్-AIFF)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా-FIFA) నిషేధం విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court)కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
కచ్చితంగా భారత జట్టు ట్రోఫీ గెలవగలదు.. తేల్చి చెప్పిన పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్
ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా సస్పెన్షన్ (Suspention) ఎత్తివేసేలా కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే తొలుత ప్రకటించిన షెడ్యూల్ (Schedule) ప్రకారం అండర్ 17 మహిళల ప్రపంచకప్‌ను భారత్‌లోనే నిర్వహించేలా చూడాలని ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లో ప్రపంచ కప్ దేశం దాటి వెళ్ళిపోయే పరిస్థితులు రాకుండా చూడాలని వెల్లడించింది.