Pollution in Delhi: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూళ్లు బంద్‌

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది.

Representational image (Photo Credits: ANI)

Newdelhi, Nov 3: దేశ రాజధాని ఢిల్లీని (Delhi) వాయు కాలుష్యం (Air pollution) చుట్టేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత (Air quality levels) పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనికి చలి తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ నగరాన్ని పొగ చుట్టేసింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రభుత్వం ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు (Primary schools) సెలవులు ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది.

JEE Syllabus: జేఈఈలో సిలబస్‌ తగ్గింపు.. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాల తొలగింపు.. మెయిన్‌ నోటిఫికేషన్‌ విడుదల

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now