Andhra Pradesh: వీడియో ఇదిగో, శివలింగాన్ని ఆభరణంలా చుట్టేసుకుని భక్తులకు దర్శనమిచ్చిన నాగుపాము, ఇది శివలీలేనంటూ భక్తి పారవశ్యంలో మునిగిన భక్తులు
ఏపీలోని వైజాగ్ చంద్రబాబునాయుడు కాలనీలో ఉన్న శివాలయంలోకి నాగుపాము ప్రవేశించి శివలింగాన్ని ఆభరణంలా చుట్టేసింది. చాలాసేపు పడగ విప్పి అలాగే దర్శనమిచ్చింది. ఆలయంలో ఉన్న భక్తులు ఇది శివలీలేనంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా శివలీల అంటూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.
ఇక హైదరాబాద్ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయం(Hyderabad Shiva Temple)లో శివలింగం వెనుక మాంసం(meat) పడిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు.
శివాలయంలో మాంసం ముద్ద ఘటనలో బిగ్ ట్విస్ట్.. మాంసం ముద్ద పడేసిన పిల్లి, సీసీటీవీ వీడియో వైరల్
ఈ ఘటన వివాదానికి దారి తీసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక సీసీటీవీ(CCTV)ని క్షుణ్ణంగా పరిశీలించగా గుడిలో మాంసం ముద్ద ఘటనలో బిగ్ ట్విస్ట్ తెలిసింది. మాంసం ముద్ద నోట్లో పెట్టుకొని పిల్లి గుడిలో పడేసినట్లు వీడియోలో కనిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా వివాదానికి తెరపడింది.
Cobra Snake found wrapped around the Shivling in the Shiv temple in Vizag
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)