Andhra Pradesh: నువ్వు బాధపడొద్దమ్మా, నేను చూసుకుంటాను, ఒమన్ బాధితురాలికి అండగా నిలిచిన నారా లోకేష్, త్వరలో నిన్ను స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేస్తామని వెల్లడి
"ఇక నువ్వు బాధపడొద్దమ్మా... నేను చూసుకుంటాను. ఇప్పుడే నీ విషయాన్ని ఎన్నారై టీడీపీ వాళ్లకు వివరిస్తాను. వాళ్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ నిన్ను కాపాడతారు. వీలైనంత త్వరలో నిన్ను స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేస్తారు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు వీడియోల రూపంలో గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇటీవలే చొరవ చూపి కువైట్ నుంచి శివ అనే కార్మికుడిని స్వస్థలానికి రప్పించారు. తాజాగా, మామిడి దుర్గ అనే యువతి కూడా ఇదే రీతిలో ఒమన్ లో చిక్కుకుపోయి ఆరోగ్యం బాగాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏజెంట్ చేతిలో మోసపోయానని, ఆరోగ్యం దెబ్బతిన్నదని, తనను స్వస్థలానికి చేర్చాలంటూ నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేసింది. ఆ వీడియోలో మామిడి దుర్గ కన్నీటిపర్యంతమైంది. వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి నాగుపాముతో ఆటలు, ఒక్కసారిగా పైకి దూసుకువచ్చి కాటేయడంతో ఆస్పత్రి పాలు..
ఆమె పరిస్థితి పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "ఇక నువ్వు బాధపడొద్దమ్మా... నేను చూసుకుంటాను. ఇప్పుడే నీ విషయాన్ని ఎన్నారై టీడీపీ వాళ్లకు వివరిస్తాను. వాళ్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ నిన్ను కాపాడతారు. వీలైనంత త్వరలో నిన్ను స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేస్తారు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మామిడి దుర్గ వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు.
Here's Nara Lokesh Tweet