Nellore Cow Sold for Rs.40 Crores: బ్రెజిల్‌లో రూ. 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు, ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డు

ఏకంగా 4.8 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.40 కోట్లన్నమాట.

Nellore Cow sold for 40 crores in Brazil sets new livestock auction milestone

వయాటినా – 19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్‌ (Viatina-19 FIV Mara Imoveis) అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు బ్రెజిల్‌ వేలంలో.. ఏకంగా 4.8 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.40 కోట్లన్నమాట. భార‌త‌దేశానికి చెందిన ఈ మేలుజాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా (World Most Expensive Cow) రికార్డుకెక్కింది. ఈ రకపు ఆవును 1868లోనే బ్రెజిల్‌కు తరలించారు. అప్పటి నుంచి ఈ ఆవులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఏర్పడింది. మరోవైపు ఈ రకం ఆవులు ఒక్క బ్రెజిల్‌ దేశంలోనే 16 మిలియన్ల వరకూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)