Andhra Pradesh: శభాష్ ఏపీ పోలీస్, గుండెపోటుకు గురైన RTC డ్రైవర్‌కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులు, వీడియో ఇదిగో..

ఏపీలోని నందిగామలోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఒక RTC డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. 112 అత్యవసర కాల్ కు స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, CPR ఇచ్చి, అతని ప్రాణాలను కాపాడి, వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.

AP Police Saved RTC Driver Life Who suffer sudden cardiac arrest near the old bus stand in Nandigama

ఏపీలోని నందిగామలోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఒక RTC డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. 112 అత్యవసర కాల్ కు స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, CPR ఇచ్చి, అతని ప్రాణాలను కాపాడి, వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. సమాజానికి నిజమైన సంరక్షకులు పోలీసులు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్స్ వేదికగా ఏపీ పోలీస్ ట్వీట్ చేస్తూ ఒక ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలను కాపాడడంలో వీరోచిత చర్య చేసిన VjaCityPoliceకు అభినందనలు.

వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టిన మందుబాబు, కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో ఘటన, నిందితుడు అరెస్ట్

మీ అంకితభావం, ధైర్యం మరియు మనస్సాక్షికి అత్యున్నత ప్రశంసలు అని DGP హరీష్ కుమార్ గుప్తా ప్రశంసించారు. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉంది. సమయస్పూర్తితోడ్రైవర్ ప్రాణాలు కాపాడిన ఏపీ పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

AP Police Saved RTC Driver Life Who suffer sudden cardiac arrest

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now