BJP MLA Sibu Misra: ఆ నీళ్లలో కూడా నడవలేవా, బీజేపీ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్న నెటిజన్లు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్

అసోం బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన ప‌నిని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకుంటున్నారు. బీజేపీకి చెందిన సిబు మిశ్రా అనే ఎమ్మెల్యే వరదల ప్రభావిత గ్రామాల్లో ప‌ర్య‌టించ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. ఓ చోట విప‌రీత‌మైన నీరు ఉండ‌టం ద్వారా ఆయ‌న‌కు దాట‌డం సాధ్య‌ప‌డ‌లేదు.

Assam BJP MLA Sibu Misra (Photo-ANI)

అసోం బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన ప‌నిని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకుంటున్నారు. బీజేపీకి చెందిన సిబు మిశ్రా అనే ఎమ్మెల్యే వరదల ప్రభావిత గ్రామాల్లో ప‌ర్య‌టించ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. ఓ చోట విప‌రీత‌మైన నీరు ఉండ‌టంతో అక్క‌డే ఉన్న రెస్క్యూ టీమ్ స‌భ్యుడి వీపుపై ఎక్కి, ఎమ్మెల్యే ప‌డ‌వ వ‌ర‌కూ వెళ్లారు. ఇప్పుడు ఇదే వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే.. ఈ ప్రాంతంలో పెద్ద నీళ్లేమీ లేవు. క‌నీసం మోకాల్లోతు అంత నీరు కూడా లేదు. అయినా స‌రే.. రెస్క్యూ టీమ్ స‌భ్యుడి వీపుపై ఎక్కి, ప‌డ‌వ వ‌ర‌కూ వెళ్ల‌డం ఏంట‌ని నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement