Special Leaves in Assam: అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు.. ఎందుకో మీకు తెలుసా?
ప్రభుత్వ ఉద్యోగులకు అస్సాం ప్రభుత్వం రెండు రోజులు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. నవంబర్ 6, 8 తేదీల్లో ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ లు ఇస్తున్నట్టు తెలిపింది.
Newdelhi, July 12: ప్రభుత్వ ఉద్యోగులకు అస్సాం ప్రభుత్వం (Assam Government) రెండు రోజులు ప్రత్యేక సెలవులు (Special Leaves) ప్రకటించింది. నవంబర్ 6, 8 తేదీల్లో ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ లు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ సెలవులు కేవలం తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకు మాత్రమేనని, టూర్ల పేరిట ఎంజాయ్ చేసేందుకు కాదని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ సెలవులు వినియోగానికి అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొంది. కుటుంబాల్లో అనుబంధాల్ని పెంచడానికి, సభ్యుల మధ్య ప్రేమానురాగాల్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వాధికారులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)