Hyderabad, July 12: కాల్పుల ఘటనలతో హైదరాబాద్ (Hyderabad) దద్దరిల్లుతున్నది. ఇటీవల నగర శివారులోని రింగురోడ్డుపై పారిపోతున్న పార్థీ ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపడంతో నగరమంతా ఉలిక్కిపడింది. ఇంకా ఆ ఘటనను మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద మరో కాల్పుల (Gun fire at Nampally Railway Station) ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారు. అయితే, పోలీసులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం చెప్పకుండా అనుమానపు చూపులు చూశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి గొడ్డలితో పోలీసులపై దాడికి యత్నించాడు. మరొకడు రాయితో దాడిచేశాడు.
హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం
నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను ప్రశ్నించిన పోలీసులు.
పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించగా.. రాళ్లతో పోలీసులపై దాడి చేసిన మరో వ్యక్తి..
తప్పించుకునే ప్రయత్నంలో వారిపై కాల్పులు చేసిన… pic.twitter.com/pkOFdVh1Y6
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2024
దోపిడీ కోసం వచ్చారా?
దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరికీ గాయాలు కాగా వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను ఉత్తరప్రదేశ్ కు చెందిన అనీస్, రాజ్ గా గుర్తించారు. వీరితో పాటు ఈ గ్యాంగ్ లో మరో ఇద్దరు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీకి పాల్పడటానికే వీళ్లు నగరానికి వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.
వీడియో ఇదిగో, విమానం టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్లు, పైలట్ల అప్రమత్తతతో బ్రతికిన 176 మంది ప్రయాణికులు