Bhairavam Teaser Out: రాత్రి నాకో కల వచ్చింది, చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు అంటూ భైరవం టీజర్ విడుదల, హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టిన యంగ్ హీరోలు
టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీలక పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘భైరవం’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టారు.
టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీలక పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘భైరవం’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టారు. రాత్రి నాకో కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. అంటూ జయ సుధ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. శీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే ప్రాణాలు తీస్తా అని మనోజ్ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పాడు.
వారాహి గుడి, ఒక ఊరు నేపథ్యంలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ ముగ్గురు హీరోల పక్కన దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది కథానాయికలుగా నటించారు. అలాగే జయసుధ, ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
Bhairavam Teaser
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)