Lightning Strike Video: వీడియో ఇదిగో, వర్షంలో యువతి డ్యాన్స్ వేస్తుండగా పెద్ద శబ్దంతో పడిన పిడుగు, బిత్తరపోయి ఇంట్లోకి పరిగెత్తిన యువతి

ఓ యువతీ వర్షంలో తడుస్తూ రీల్స్‌ చేస్తూ తృటిలో ప్రాణాల నుంచి బయటపడింది. బిహార్‌లోని సీతామర్హిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Girl Making Instagram Reels in Rain Miraculously Survives Multiple Lightning Strikes in Sitamarhi, Heart-Stopping Video Goes Viral

ఓ యువతీ వర్షంలో తడుస్తూ రీల్స్‌ చేస్తూ తృటిలో ప్రాణాల నుంచి బయటపడింది. బిహార్‌లోని సీతామర్హిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో బేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సియా గ్రామానికి చెందిన ముఖియా రాఘవేంద్ర భగత్ అలియాస్ కమల్ భగత్ కూతురు సానియా కుమారి పొరుగునే ఉన్న దేవనారాయణ్‌ భగవత్‌ ఇంటి డాబాపై వర్షంలో నడుస్తూ డ్యాన్స్‌ చేస్తున్నది. ఆమె రీల్స్‌ చేస్తుండగా ఆమె స్నేహితుడు వీడియో తీస్తూ వచ్చాడు.  షాకింగ్ వీడియో,బెడ్ మీద ఉన్న పేషెంట్‌ని కడుపు మీద దారుణంగా కొట్టిన ఆస్పత్రి సిబ్బంది, నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ఉన్నట్టుండి ఇంటికి దగ్గరలో భారీ శబ్దం, మెరుపులతో పిడుగుపడింది. దాంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆమె అక్కడి నుంచి పరుగులు పెట్టింది. ఇది చూసిన పలువురు ఆమె చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి సోషల్‌ మీడియాలో ఫేమ్‌ ఇచ్చేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement