Bihar: వీడు టీచరా లేక శాడిస్టా, పిల్లాడిని అంత దారుణంగా కొడతారా, బీహార్‌లోని పాట్నాలో ఘటన, వీడియో వైరల్ కావడంతో టీచర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు
బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఓ టీచర్ పిల్లాడిని కొడుతున్న ఘటన వీడియో వైరల్ అవుతోంది. ఆరేళ్ళ వయసున్న పిల్లాడిని ఏమాత్రం కనికరం లేకుండా చితకబాదాడు. ఆ విద్యార్థి ఏడుస్తూ మొత్తుకుంటున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా.. పశువు కంటే దారుణంగా కసితీరా కొట్టాడు.
బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఓ టీచర్ పిల్లాడిని కొడుతున్న ఘటన వీడియో వైరల్ అవుతోంది. ఆరేళ్ళ వయసున్న పిల్లాడిని ఏమాత్రం కనికరం లేకుండా చితకబాదాడు. ఆ విద్యార్థి ఏడుస్తూ మొత్తుకుంటున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా.. పశువు కంటే దారుణంగా కసితీరా కొట్టాడు. పాట్నా జిల్లాలోని ధనరువా బ్లాక్‌లోని ఓ ప్రయివేట్ కోచింగ్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా పిల్లాడిని కర్రలు విరిగేలా కొట్టిన ఆ యువ టీచర్... అంతటితో ఆగకుండా.. వీపు మీద చేతులతో కొట్టడంతోపాటు.. జట్టు పట్టుకొని లాగేశాడు. పిల్లాడు ఏడుస్తూ.. కొట్టొద్దని వేడుకుంటున్నప్పటికీ ఆయన వినలేదు. ఆ చిన్నారిని హాస్పిటల్‌కు తరలించిన స్థానికులు.. టీచర్‌ను పట్టుకొని చితకబాదారు.ట్యూషన్ టీచర్ అమరకాంత్ అరెస్ట్ చేసినట్లు పాట్నా పోలీసులు తెలిపారు. విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పాట్నా SSP తెలిపారు.