Biker Hits Leopard: రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన బైకర్.. గాయపడ్డ చిరుత, కాసేపటి తర్వాత చెట్ల పొదల్లోకి వెళ్లగా వైరల్‌గా మారిన వీడియో
కేరళ - తమిళనాడు సరిహద్దులో నడుకాని మరపాలెం వద్ద బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు(Biker Hits Leopard) దాటున్న చిరుతను ఢీకొట్టాడు.
కేరళ - తమిళనాడు సరిహద్దులో నడుకాని మరపాలెం వద్ద బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు(Biker Hits Leopard) దాటున్న చిరుతను ఢీకొట్టాడు. చిరుతపులి గాయపడింది. కొంతసేపటి తర్వాత లేచి సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన గురువారం ఉదయం 8 గంటల సమయంలో జరిగింది.
గుడలూరు ప్రాంతానికి చెందిన రాజన్ అనే వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తుండగా, చిరుత అడ్డుగా రావడంతో (Leopard Crossing the Road)ప్రమాదం సంభవించింది. ఢీకొట్టిన తర్వాత చిరుతతో పాటు బైకర్ కూడా రోడ్డుపై పడ్డారు.
బైస్కిలే.. కానీ సింగిల్ వీల్, బెంగళూరు రోడ్లపై వైరల్‌గా మారిన వీడియో
ప్రమాదం తర్వాత కొన్ని నిమిషాల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిరుత, ఆ తర్వాత మెల్లగా లేచి సమీపంలోని అడవిలోకి పారిపోయింది. ఈ ప్రమాదంలో రాజన్ స్వల్ప గాయాలతో బయటపడగా ఫారెస్ట్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వీడియో ఫుటేజ్ ఆధారంగా చిరుతకు పెద్దగా గాయాలు కాలేదని నిర్ధారించారు.
Biker Collides with Leopard Crossing the Road
#Kerala: A leopard was injured after being hit by a speeding bike while crossing the road at Nadukani Marapalam on the Kerala-Tamil Nadu border.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)