Karnataka Egg Row: బ్రాహ్మణ బాలికకు స్కూల్లో బలవంతంగా కోడిగుడ్లు తినిపించిన టీచర్.. విద్యాశాఖకు తండ్రి ఫిర్యాదు.. కర్ణాటకలోని శివమొగ్గ ప్రభుత్వ పాఠశాలలో ఘటన
ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న తన కూతురికి ఓ టీచర్ బలవంతంగా కోడిగుడ్లు తినిపించారంటూ బాలిక తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Newdelhi, Nov 24: ప్రభుత్వ పాఠశాలలో (Government School) 2వ తరగతి చదువుతున్న తన కూతురికి (Girl Child) ఓ టీచర్ బలవంతంగా కోడిగుడ్లు (Eggs) తినిపించారంటూ బాలిక తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. కోడిగుడ్లు తిన్నాక తన కూతురు అస్వస్థతకు గురైందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాలిక తండ్రి ఆరోపణల్ని స్కూల్ ఉపాధ్యాయులు కొట్టిపారేశారు. పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి మాత్రమే ప్రేరేపించామని తెలిపారు. కాగా బాధితురాలు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారుగా సమాచారం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)