BSF jawans Celebrated Bihu: గడ్డ కట్టే మంచులో జవాన్ల డ్యాన్స్, బిహూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ బిహూ నృత్యాలు చేసిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

పంట చేతికొచ్చిన తరుణంలో రైతులు నృత్యాలు చేస్తూ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా కశ్మీర్ లోని గడ్డకట్టించే మంచులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ఆనందోత్సాహాలతో బిహూ నృత్యాలు చేశారు.

BSF jawans celebrate Bihu

సంక్రాంతి పండుగ తరహాలో, అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రైతుల పండుగ అయిన బిహూ పండుగను జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన తరుణంలో రైతులు నృత్యాలు చేస్తూ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా కశ్మీర్ లోని గడ్డకట్టించే మంచులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ఆనందోత్సాహాలతో బిహూ నృత్యాలు చేశారు. నియంత్రణ రేఖ సమీపంలో 24 గంటలూ ఎంతో ఒత్తిడి నెలకొన్న విధులు, ఇంటికి దూరంగా ఉండడం, క్లిష్టమైన మంచు పర్వతాలు, కంటికి కనిపించని ప్రమాదాలు... బిహూ నృత్యం చేయకుండా బీఎస్ఎఫ్ జవాన్లను ఇవేవీ అడ్డుకోలేవు. కెరాన్ సెక్టార్ లో సరిహద్దు వెంబడి జవాన్లు ఘనంగా బిహూ వేడుకలు జరుపుకున్నారు" అంటూ బీఎస్ఎఫ్ కశ్మీర్ విభాగం ట్విట్టర్ లో పేర్కొంది. ఈ మేరకు వీడియో కూడా పంచుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)