Bungee Jumping Goes wrong: యువతి బంగీ జంప్‌, గాల్లో ఉండగా ఒక్కసారిగా తెగిన తాడు, భయానకమైన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌

యువతి బంగీ జంప్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి బంగీ జంప్ కోసం రెడీ అయింది. అక్కడి ఆపరేటర్‌ ఆమెను లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి కిందకు తోసేశాడు

Bungee Jumping Goes wrong (Photo-Video Grab)

యువతి బంగీ జంప్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి బంగీ జంప్ కోసం రెడీ అయింది. అక్కడి ఆపరేటర్‌ ఆమెను లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి కిందకు తోసేశాడు. అయితే యువతి బంగీ జంపింగ్‌ మధ్యలో ఉండగానే కాళ్లకు కట్టిన తాడు తెగిపోయింది. దీంతో ఆ యువతి బలంగా కింద ఉన్న నీళ్లలో పడిపోయింది.

భయానకమైన ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగింది?.. ఆ యువతి పరిస్థితి ఏంటన్నదానిపై ఎక్కడా స్పష్టత లేదు. కాకుంటే నెటిజన్లలో కొందరు మాత్రం ఆమె సురక్షితంగానే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సీసీటీవీ ఐడియట్స్‌ అనే ట్విటర్‌పేజ్‌ నుంచి ఈ వీడియో పోస్ట్‌ కాగా, మిలియన్ల వ్యూస్‌తో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Heres' Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now