Hyderabad Horror: హైదరాబాద్ లో భయానక రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారి మీదకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
జవహర్ నగర్ పరిధిలో శుక్రవారం సాయంత్రం అతి వేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బైక్ మీద కూర్చొనిఉన్న సుబాన్(20) అనే వ్యక్తి పైకి దూసుకు వెళ్లింది.
Hyderabad, June 22: హైదరాబాద్ (Hyderabad) లో రోడ్డు మీదకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. జవహర్ నగర్ పరిధిలో శుక్రవారం సాయంత్రం అతి వేగంతో వచ్చిన ఓ కారు (Car) అదుపుతప్పి రోడ్డు పక్కన బైక్ మీద కూర్చొనిఉన్న సుబాన్(20) అనే వ్యక్తి పైకి దూసుకు వెళ్లింది. అనంతరం అదే వేగంతో మరో అయిదు ద్విచక్ర వాహనాలను కారు డీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుబాన్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు నడిపిన డ్రైవర్ అజర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)