Firing Caught On Camera: ఎస్సై నిర్లక్ష్యంతో పొరపాటున పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకుపోయిన తూటా.. ఉత్తరప్రదేశ్ లో ఘటన.. పరారీలో ఉన్న ఎస్సై కోసం పోలీసుల గాలింపు (వీడియోతో)
ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యం ఓ మహిళను ప్రాణాపాయంలోకి నెట్టింది. ఓ ఎస్సై తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో అది పొరపాటున పేలడంతో అప్పుడే అక్కడికి పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం వచ్చిన ఓ మహిళ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది.
Newdelhi, Dec 9: ఓ పోలీసు అధికారి (Police Officer) నిర్లక్ష్యం ఓ మహిళను ప్రాణాపాయంలోకి నెట్టింది. ఓ ఎస్సై (SI) తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో అది పొరపాటున పేలడంతో అప్పుడే అక్కడికి పాస్ పోర్టు (Passport) వెరిఫికేషన్ కోసం వచ్చిన ఓ మహిళ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లో అలీగఢ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడైన ఎస్సై మనోజ్ కుమార్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదిగో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)