Chennai Toddler Saving: డియర్ చెన్నైస్.. మీరు సూపర్బ్.. అందరూ కలిసి నెలల చిన్నారిని కాపాడటం వావ్.. వైరల్ వీడియో మీరూ చూడండి!
ఓ ఏడు నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు జారింది.
Chennai, Apr 29: తమిళనాడు రాజధాని చెన్నైలో (Chennai) మానవత్వం పరిమళించే అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఏడు నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు జారింది. అదృష్టవశాత్తూ మరో అంతస్తు అంచున పడి ఆగింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని పలువురు ముందుకొచ్చారు. బెడ్ షీట్లు (Bed Sheets) పట్టుకుని కొంతమంది కింద నిల్చున్నారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు పైకెక్కి చిన్నారిని రక్షించారు. పాపను రక్షించిన వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)